బాలీవుడ్ డైరెక్టర్ లేఖ్‌ టాండన్‌ ఇకలేరు

- October 16, 2017 , by Maagulf
బాలీవుడ్  డైరెక్టర్ లేఖ్‌ టాండన్‌ ఇకలేరు

బాలీవుడ్ 'బాద్‌షా' షారుఖ్ ఖాన్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ లేఖ్‌ టాండన్‌ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. 1988లో టాండన్‌ దర్శకత్వం వహించిన 'దిల్‌ దరియా' అనే ధారావాహికలో షారుక్‌కి అవకాశం ఇచ్చి బుల్లితెరకు పరిచయం చేసాడు.
ఈ సీరియల్‌తో షారుక్‌కి మంచి గుర్తింపు రావడంతోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. టాండన్‌ హిందీలో 'ఆమ్రపాలి', 'దుల్హన్‌ వాహీ జో పియా మన్‌ భాయే' తదితర చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు పొందాడు..టాండన్‌ మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌ ఖాన్‌, రిషి కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com