సడన్ గా ల్యాండ్ అయిన ఎయిర్ ఆసియ విమానం
- October 16, 2017
ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు బయల్దేరిన ఎయిర్ ఏషియా విమానం ఒకటి అత్యవసరం వెనక్కి వచ్చింది. దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని అర్ధాంతరంగా 10 వేల అడుగుల ఎత్తులోకి దింపేసి 25 నిమిషాల తర్వాత తిరిగి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సురక్షితంగా దింపేశారు. క్యాబిన్‌లో సమస్య ఏర్పడటమే కాకుండా టెక్నికల్ సమస్య తోడవడంతో ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని అత్యవసరంగా దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
సోమవారం ఉదయం ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు ఎయిర్‌ఏషియా విమానం బయలుదేరింది. అలా వెళుతున్న కాసేపటికే విమానం క్యాబిన్‌లో ఒత్తిడి తగ్గిపోవడంతో వెంటనే విమానం వణికిపోవడం మొదలైంది. దీంతో విమానంలోని ప్రయాణీకులంతా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించాలని సిబ్బంది ప్రకటన చేశారు. దీంతో ప్రయాణీకులు మరింత బెంబేలెత్తిపోయి తమ ఫోన్‌లు తీసుకోని ఎస్సెమ్మెలు పంపించడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ గట్టిగా భయంతో కేకలు పెడుతూ ఏడ్వడం మొదలుపెట్టారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన పొరపాటుకు ఎయిర్ ఏషియా క్షమాపణలు చెప్పింది. సంఘటనపై విచారణకు ఆదేశిస్తామని, సాంకేతిక లోపం వల్లే సమస్య తలెత్తిందని వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







