ఫాలో ట్రాఫిక్ రూల్స్: లేదంటే అంతే సంగతులు
- October 16, 2017
దుబాయ్: నిబంధనల్ని కాదని 50 శాతం మించి టింటెడ్ గ్లాస్ కలిగిన వాహనాన్ని వినియోగిస్తున్నారా? 1,500 దిర్హామ్ల జరీమానాని ఎదుర్కోక తప్పదు. ఇదొక్కటే కాదు, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆయా ఉల్లంఘనలకు సంబంధించి భారీ జరీమానాలు తప్పవు. వాహన ఇంజిన్లో మార్పులు చేస్తే గనుక 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు 12 బ్లాక్ పాయింట్స్ భరించాల్సిందే. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లో మాట్లాడినా, ఆఖరికి ఎస్ఎంఎస్లు పంపినా జరీమానాలు కఠినంగా ఉంటాయి. రోడ్లపై ప్రమాదాలు తగ్గించడానికి జరీమానాలు, బ్లాక్ పాయింట్లు తప్పనిసరి అవుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. నిబంధనల్ని కఠినతరం చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయనీ, ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య కూడా తగ్గుతోందని అధికారులు వెల్లడించారు. రోడ్లపై మీరు ప్రదర్శించే అతి జాగ్రత్త మీకు ప్రమాదకరం మాత్రమే కాదు, ఇతరులకూ హానికరం. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







