రస్‌ అల్‌ ఖైమా నివాసితులకు సీవేజ్‌ బిల్‌

- October 16, 2017 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమా నివాసితులకు సీవేజ్‌ బిల్‌

రస్‌ అల్‌ ఖైమా: రస్‌ అల్‌ ఖైమా నివాసితులు, వచ్చే ఏడాది నుంచి సీవేజ్‌ బిల్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. నీటి వినియోగానికి అదనంగా 50 శాతం బిల్లుని సీవేజ్‌కి చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారులు. ఫెడరల్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ (ఫెవా) బిల్లుతోపాటే సీవేజ్‌ బిల్లు కూడా వస్తుందని అధికారులు వివరించారు. ఎమిరేట్‌ వ్యాప్తంగా 85,000 మంది ఫెవా పరిధిలో ఉండగా, 20,000 ఇళ్ళు సీవేజ్‌ నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అయి ఉన్నాయి. మవైరిద్‌ ప్రాంతాన్ని కనెక్ట్‌ చేసేందుకు ఫెవా, గత ఆగస్ట్‌లో పనులు ప్రారంభించింది. జూన్‌ 2018 నాటికి 564 ప్లాట్లు సీవేజ్‌ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ అవుతాయి. కొత్త సీవేజ్‌ సిస్టమ్‌, పాత ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుంది. సీవేజ్‌ డిపార్ట్‌మెంట్‌, 65 మిలియన్‌ దిర్హామ్‌లతో ఫిల్యా సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com