గోపీచంద్ తో పోటీకి సిద్ధం అంటున్న రామ్
- October 17, 2017
టాలీవుడ్లో ఈ మధ్య సంక్రాంతి, దసరా సీజన్లలో మినహాయించి, ఎప్పుడో ఒకసారి తప్ప సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో దిగడం లేదు. ఒకవేళ వస్తే..ఆ ప్రభావం ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్ల మీద పడుతుంది. కానీ ఈ నెలాఖరున అంచనాలున్న రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.
ఈ నెల 27న తెలుగులో రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ, మరొకటి గోపిచంద్ నటించిన ఆక్సిజన్. రామ్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉంటే, గోపిచంద్ కి మాస్ లో క్రేజ్ ఉంది. అందుకే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది.
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకుడు. రామ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి నటిస్తున్నారు. లవ్, ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఆల్ రెడీ రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
ఇక గోపిచంద్ ఆక్సిజన్ మీద కూడా అంచనాలున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అను ఇమ్మానుయేల్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ట్రైలర్ చూస్తే...ఈ మూవీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. అయిత రామ్, గోపిచంద్ నటించిన గత చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో వీరిద్దరికీ ఇప్పుడు హిట్ కావాలి. మరి ఒకే రోజు వస్తున్న చిత్రాలతో రామ్, గోపిచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







