వెల్లుల్లితో అనారోగ్య సమస్యలకు చెక్
- November 04, 2015
ఆహార పదార్థాలకు రుచిని.. ఘుమఘుమల సువాసనను అందిస్తుంది వెల్లుల్లి. ఇది వంటలకు టేస్ట్ నే కాదు అనారోగ్య సమస్యలకు సహజ ఔషధం కూడా. ఇంట్లో ఉండే సహజ మందుగా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. జింజర్ టీలోని 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి వాడుతారు. ఆయుర్వేద ఔషధాల తయారీలలో కూడా వెల్లుల్లికి డిమాండ్ ఉంది. మరి ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇంకెన్ని లాభాలుంటాయో తెలుసా. ఉదయాన్నే వెల్లుల్లి తింటే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. ఔషధ గుణాలు మెండుగా ఉన్న వెల్లుల్లి జలుబు, ఫ్లూ, జ్వరం, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి రకరకాల రోగాలను అరికడుతుంది. ప్రయాణాలలో కలిగే విరేచనాలకు, ప్రీఎక్లంప్సియా, కరోనరీ ఆర్టేరీ డిసిజేస్, గుండెపోటు, ధమనులు గట్టిపడటం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నివారించటానికి తోడ్పడుతుంది. ఉదయం పరగడుపునే వెల్లుల్లిని తినటం వల్ల మరింత శక్తివంతంగా, యాక్టివ్ గా ఉండటమే కాదు ఇది యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. అల్పాహారానికి ముందు వెల్లుల్లి తినటం వల్ల జీర్ణాశయంలో బ్యాయాక్టీరియాలను నాశనం చేస్తుంది. వెల్లుల్లిను తినటం వలన అధిక రక్త పోటు నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, దీని వాడకం వలన రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె వ్యాధులను తగ్గించి, కాలేయ, మూత్రాశయ పనితీరులను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల విరేచనాలు, ఇతర జీర్ణాశయ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. రోజు ఉదయన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే... నాడీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి ఆకలిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని పూర్తీగా తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. ఒత్తిడికి గురైనప్పుడు, కడుపులో ఆసిడ్ లు అధిక మొత్తంలో విడుదలవుతాయి. అలాంటి సమయంలో వెల్లుల్లి ఈ ఆసిడ్ ల స్థాయిలను తగ్గించి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ ల ఇన్ఫెక్షన్ ల నుంచి పూర్తిగా ఉపశమనాన్ని కలిగించడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి తలనొప్పి, కడుపు నొప్పి, సైనస్ సమస్యలు, గౌట్, కీళ్ళవాతం, ఉబ్బసం, బ్రోన్కైటిస్, శ్వాస సంబంధ సమస్యలు, లో బీపీ, రక్తంలో అల్ప చక్కెర స్థాయిలు, అధిక చక్కెర స్థాయిలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో వెల్లెల్లి సహకరిస్తుంది
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







