స్పెయిన్ లో కూలిన ఫైటర్ జెట్
- October 17, 2017
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మిలటరీ యుద్ధవిమానం కూలిన ఘటనలో పైలట్ చనిపోయాడు. టోర్రెజోన్ డి ఆర్డోజ్ ఎయిర్‌బేస్ నుంచి మంగళవారం ఉదయం ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీంతో పైలట్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్ జాతీయదినం సందర్భంగా ప్రదర్శించే జెట్ విమానల్లో ఇదీ ఒకటని అధికారులు తెలిపారు. మృతి చెందిన పైలట్ ముర్సియాకు చెందిన లెఫ్టినెంట్ ఫెర్నాండో పెరెజ్ సెరానో(26) అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అతడొక్కడే ఉన్నాడని వెల్లడించింది. కాగా, స్పెయిన్‌లో వారం వ్యవధిలో జరిగిన రెండో విమాన ప్రమాద ఘటన ఇది. గత గురువారం ఆల్బాసెట్ మిలటరీ బేస్ నుంచి బయలుదేరిన యూరోఫైటర్ జెట్ విమానం కూలిపోగా పైలట్ మృత్యువాతపడ్డాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







