''మీ టూ'' ప్రభంజనం
- October 17, 2017
చీరలెత్తుకెళ్లాడు చిలిపి కృష్ణుడంటూ పాటలెత్తుకోవడం కాదు.. అలా చీరలెత్తుకెళ్ళినోడ్ని చీరెయ్యండి అంటూ సోషల్ మీడియాలో ఒక కాన్వాసింగ్ మొదలైంది. వర్క్ ప్లేసెస్ లో గాని, జర్నీ టైమింగ్స్ లో గానీ, బస్ స్టాపుల్లో గానీ మహిళలపై లైంగిక వేధింపులు ఇవాళా రేపూ కామన్! గొడవకు దిగే ఓపిక లేక చూసీచూడనట్లు ఊరుకుండిపోవడం అలవాటు చేసుకుంది మహిళా లోకం. కానీ..ఎప్పుడైనా, ఎక్కడైనా ఆకతాయిల నుంచి మీకెదురైన లైంగిక వేధింపులను సవివరంగా రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ.. ప్రపంచవ్యాప్తంగా ఒక ఓపెన్ కాల్ ప్రచారంలోకొచ్చింది.
Me Too హాష్ ట్యాగ్ మీద ఈ పోస్టులన్నింటినీ ప్రపంచం మొత్తం చూడవచ్చు. ఈ విధంగా మహిళల్లో చైతన్యం పెంచాలన్నది ఐడియా. సెక్సువల్ హరాస్ మెంట్ అభియోగాలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వీ వీన్ స్టీన్ కు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అక్టోబర్ 15న మొదలైంది. ''ఒక ఫ్రెండ్ గా చెబుతున్నా.. పంటిబిగువున భరించింది చాలు..
ఇకనైనా ఓపెనప్ కండి.. మగాళ్లలోని మురికితనాన్ని ఎండగట్టండి.. మీకెదురైన వేధింపుల్ని ప్రపంచం ముందు పెట్టండి'' అంటూ నటి అలీసా మిలానో ట్వీట్ చేసిన తర్వాత.. ''# Me Too'' కాన్వాసింగ్ ఇంకా ఇంకా ఊపందుకుంది.
ఇండియాలో అయితే మరీ ఎక్కువగా!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







