శరత్ బాబు తో పెళ్లి - ఇసుమంతైనా నిజం లేదంటున్న ముద్దుగుమ్మ

- October 17, 2017 , by Maagulf
శరత్ బాబు తో పెళ్లి - ఇసుమంతైనా నిజం లేదంటున్న ముద్దుగుమ్మ

తన బొద్దు ముద్దు అందాలతో టాలీవుడ్ నేకాక కోలీవుడ్ ను ఊపేసిన ముద్దుగుమ్మ నమిత సీనియర్ నటుడు శరత్ బాబుని పెళ్లి చేసుకోబోతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే ఈ రూమర్స్‌పై స్పందించిన శరత్ బాబు అదంతా కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు ఆమెని చూసే ఎనిమిదేళ్లయిందని, ఆమెతో ఇప్పుడు నాకు పెళ్లేంటి అని స్పష్టంచేశాడు శరత్ బాబు. ఇదిలావుంటే, తాజాగా ఈ రూమర్స్ పై నమిత కూడా స్పందించింది. 

శరత్ బాబుని పెళ్లి చేసుకోనున్న నమిత అని వస్తున్న వార్తల్ని చూసిన నమిత ఒక్కసారిగా అవాక్కయ్యిందట. జనం ఇలా ఎలా నోటికొచ్చినట్టు పుకార్లు గురించి చెప్పుకుంటారు అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన నమిత అందులో ఇసుమంతైనా నిజం లేదని తీవ్రంగా ఖండించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com