యువరాజ్ సింగ్,తల్లి, తమ్ముడు పై గృహ హింస కేసు
- October 18, 2017క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదు అయ్యింది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసును ఫైల్ చేసింది. యువీతో పాటు అతని సోదరుడు జోరావార్, మాతృమూర్తి షబనమ్ సింగ్‌పైన కూడా గృహ హింస కేసును నమోదు చేశారు. ఈనెల 21వ తేదీన ఈ కేసు విచారణకు రానున్నది. బిగ్‌బాస్ కాంటెస్టాంట్ ఆకాంక్షా శర్మ తరపున వాదిస్తున్న స్వాతి సింగ్ మాలిక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యువీ తల్లి షబనమ్ కూడా ఆకాంక్షపై ఫిర్యాదు చేసిందని, ఆభరణాలు వెనక్కి ఇచ్చేయాలని ఆమె కేసు వేసినట్లు న్యాయవాది స్వాతి తెలిపారు. గృహ హింస అంటే కేవలం శరీరక హింస మాత్రమే కాదు అని, అది మానసిక, ఆర్థిక వత్తిడి కూడా అని లాయర్ తెలిపారు. తన క్లయింట్ ఆకాంక్ష వేదనకు గురి అవుతుంటే, క్రికెటర్ యువీ ఓ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయారని లాయర్ ఆరోపించారు. బిడ్డను కనాలంటూ ఆకాంక్షపై యువీ తల్లి షబనమ్ పదపదే వత్తిడి చేసిందని, యువీ కూడా అలాగే వత్తిడి చేశాడని, తల్లికి అండగా యువీ నిలిచాడని, ఆకాంక్ష అత్త షబనమ్ చాలా డామినెంట్‌గా వ్యవహరించినట్లు లాయర్ స్వాతి తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి