న్యూయార్క్‌ లో ఇలా కూడా శిక్షిస్తారా..? దారుణం

- October 18, 2017 , by Maagulf
న్యూయార్క్‌ లో ఇలా కూడా శిక్షిస్తారా..? దారుణం

9 ఏళ్ల చిన్నారి పై కూర్చున్న 140 కిలోల బరువున్న మహిళ

ఊపిరాడక మరణించిన చిన్నారి
ఓ చిన్నారి సత్ప్రవర్తన కలిగిలేదని ఓ మహిళ దారుణ శిక్ష విధించింది. ఆ శిక్ష కాస్త ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వేరోనిక పోసీ(64) అనే మహిళ హత్య ఆరోపణ కేసు ఎదుర్కొంటుంది. అయితే ఈ హత్య దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయం వెల్లడైంది. 145 కిలోల బరువున్నవేరోనిక  కజిన్‌ 9 ఏళ్ల డెరికా లిండ్సే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించదనే ఆగ్రహాంతో ఆమెపై కూర్చోంది. దీంతో ఆ చిన్నారి ఊపిరి ఆడక మరణించింది.

ఆ చిన్నారి మూడు ఫీట్ల ఎత్తుతో 33 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆచిన్నారి బరువు నిందుతిరాలి బరువుకన్నా 4 రెట్లు ఎక్కువని, ఈఘటన గత శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ.,. తన కూతురు అమర్యాధకంగా ప్రవర్తించడంతో మా కోడలైన వేరొనికాను పిలిచాని తెలిపింది. అయితే వేరొనికాకు ఎన్నేళ్లు శిక్ష పడే అవకాశం ఉందనే విషయం తెలియలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com