ఫిషింగ్ బోట్ ప్రమాదం: ఎమిరేటీ కెప్టెన్, ఇండియన్ వర్కర్‌కి గాయాలు
- October 18, 2017
ఫిషింగ బోట్‌లో అగ్ని ప్రమాదం కారణంగా, ఎమిరేటీ కెప్టెన్, ఇండియన్ మెరైన్ వర్కర్ గాయాలపాలయ్యారు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోలీస్ పెట్రోల్స్‌నీ, అంబులెన్స్, పారామెడిక్స్, అలాగే రెస్క్యూ టీమ్స్‌ని సంఘటనా స్థలానికి పంపారు. రస్ అల్ ఖైమా ఫిషర్‌మెన్ సొసైటీ ఛైర్మన్ ఖలీఫా అల్ ముహైరి మాట్లాడుతూ, షామ్ టౌన్ తీర ప్రాంతానికి దగ్గరలో ఈ ప్రమాదం జరిగిందనీ, రస్ అల్ ఖైమా సిటీకి ఉత్తరంలో 40 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగిందని చెప్పారు. ఎమిరేటీ కెప్టెన్, ఫిషింగ్ బోట్ యజమానిగా గుర్తించారు. గాయపడ్డవారిని సక్ర్ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిద్దరికీ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో ఈ గటన చోటు చేసుకుంది. పేలుడుకు గల కారణాల్ని విచారిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







