అంతర్జాతీయ నగదు బదిలీ, మోసాల ముఠాని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు

- October 18, 2017 , by Maagulf
అంతర్జాతీయ నగదు బదిలీ, మోసాల ముఠాని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు

కువైట్: అంతర్జాతీయ నగదు బదిలీ ( ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ ) మోసంతో  సంబంధాలు ఉన్న ముఠా   సభ్యులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రత్యేక విభాగం అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీరి వద్ద సౌత్ ఆఫ్రికన్ మరియు నైజీరియా పాస్పోర్ట్ లను స్వాధీనం చేసుకొన్నారు. సోషల్ మీడియా ద్వారా పలువురికి ఎరవేసి వారి వద్ద నుంచి డబ్బులను అపహరించడంలో అత్యంత నేర్పరులు. బాధితుల నుంచి నగదుని వివిధ పద్ధతులలో నకిలీ అకౌంట్లను ఉపయోగించి డబ్బు బదిలీ చేయమని వత్తిడి చేసేవారు. వీరి చేష్టలపై అనుమానం కల్గిన కొందరు పౌరులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో నిందితుల చర్యల గూర్చి విచారణ చేసి పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. విలువైన సమాచారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు పబ్లిక్ రిలేషన్స్ విభాగం తెలిపింది. పౌరులు ఈ తరహా మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com