ఉత్తర కొరియాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా

- October 19, 2017 , by Maagulf
ఉత్తర కొరియాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా

 ఓవైపు ఉత్తర కొరియా అణు క్షిపణుల పరీక్షలపై ప్రపంచ దేశాలన్నీ అసహనంతో ఉండగా.. అమెరికా రచయిత,  రక్షణ పరిశోధకుడు గోర్డాన్‌ చాంగ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చైనానే ఉత్తర కొరియాకు ఆయుధాలను సరఫరా చేస్తోందంటూ ప్రకటన చేశారు. మరియా బట్రిరోమో ‘మార్నింగ్స్‌ విత్‌ మరియా’ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. 

‘‘వారి(ఉత్తర కొరియా) అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా హస్తం ఉంది.  జూలైలో జపాన్‌ మీదుగా నిర్వహించిన బాలిస్టిక్‌ క్షిపణుల పరీక్షకు ప్రధాన సామాగ్రిని సమకూర్చింది డ్రాగన్‌ కంట్రీనే. పైగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్రమైన ఉద్రిక్తకరమైన పరిస్థితులను చైనా సొమ్ము చేసుకుంటోంది. రెండు దేశాల మధ్య సమస్యను మరింత పెద్దగా చేసేందుకు చేయాల్సినవన్నీ చేస్తోంది’’ అని గోర్డాన్‌ ఆరోపించారు. 

అమెరికా రక్షణ పరిశోధకుడు, తూర్పు ఆసియా భద్రత నిపుణుడు గోర్డాన్ చాంగ్ ‘ది కమింగ్‌ కొలాప్స్ ఆఫ్ చైనా’ పుసక్తం ద్వారా రచయితగా కూడా పరిచయస్తుడే. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌.. అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇన్నాళ్లూ వాటిని బంకర్లలో దాచిన ఉత్తరకొరియా ఇప్పుడు వాటిని పరీక్షిస్తూ తమ బలం చాటే యత్నం చేస్తోందని ఆయన తెలిపారు. ఇరు దేశాలతో ఒకేసారి దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించటం ద్వారా చైనా నాటకాలాడుతోందని ఆయన అంటున్నారు. ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించేలా చైనాపై ఒత్తిడి తేవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను గోర్డాన్‌ కోరుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com