రాహుల్ రవీంద్రన్ నటించిన "హౌరాబ్రిడ్జ్" టీజర్ 2 విడుదల
- October 20, 2017శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. చిత్రం టీజర్1 ని ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావటంతో యూనిట్ సభ్యులంతా ఆనందంగా వున్నారు. ఇదే ఊపుతో దీపావళి శుభాకాంక్షలతో టీజర్2ని విడుదల చేశారు. విభిన్న కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ లో విడుదలకి సిధ్ధమవుతుంది. త్వరలోనే ఆడియో లాంచ్ చేసి... రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... బూచమ్మ బూచొడు లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత ఇది నా రెండో ప్రాజెక్ట్. ఆ చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం మెదటి టీజర్ ని ఇటీవలే విడుదల చేశాము. అయితే విడుదల చేసిన రోజు నుండి ప్రతి చోటా మా టీజర్ గురించి మాట్లాడుకోవటం చాలా ఆనందంగా వుంది. ప్రామిస్ చేయ్యటం అంటే రెండు చేతులతో కదా.. ఇలా కాదేమో.. ఇలానే బావుంది కదా అనే డైలాగ్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. చాలా మంది సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ లు చేయటం మా చిత్ర క్రేజ్ ని తెలియజేస్తుంది. ఇప్పడు దీపావళి సందర్బంగా మా రెండవ టీజర్ ని విడుదల చేస్తున్నాము. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాను. నాహీరో రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. మా హీరోయిన్స్ ఛాందిని చౌదరి, మనాలి రాథోడ్ లు ఇద్దరి పాత్రలు చాలా ఇంపార్టెంట్ వున్న పాత్రలే . ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేస్తాం. రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాం. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అని అన్నారు.
నటీనటులు: రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్, రావ్ రమేష్, అజయ్, ఆలీ, పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తదితరులు.. మ్యూజిక్ డైరెక్టర్ - శేఖర్ చంద్ర, సినిమాటోగ్రాఫర్ - విజయ్ మిశ్రా, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత - ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రేవన్ యాదు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్