ముస్లింలు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీ

- October 20, 2017 , by Maagulf
ముస్లింలు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీ

దారుల్‌ ఉలూం మరో ఫత్వా జారీ చేసింది. ముస్లింలు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడాన్ని ఫత్వా నిషేధించింది. పురుషులు, మహిళలతోపాటు పిల్లల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వాలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌కు చెందిన దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ దీన్ని జారీ చేసింది. భారత దేశంలోని అతిపెద్ద ఇస్లామిక్ సెమినరీస్‌లలో దారుల్ ఉలూమ్ ఒకటి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఫొటోలను పోస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది.  
పిల్లలు, పురుషులు, మహిళలు ఇలా ఎవరివైనాసరే ఫొటోలు తీయడం ఇస్లాంకు వ్యతిరేకమని దారుల్ ఉలూం పెద్దలు స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆధార్, రేషన్‌ కార్డులు, స్కూళ్లు, కాలేజీలకు అవసరమైన సందర్భంలో మాత్రమే ఫొటోలు తీసుకోవాలని వివరించారు. తన ఫొటోలు, తన భార్య ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చా అంటూ ఓ వ్యక్తి దారుల్ ఉలూంను పర్మిషన్ అడిగారు. దీనిపై క్లారిటీ ఇస్తూ దారుల్ ఇఫ్తా.... ఈ ఫత్వా జారీ చేసింది. దారుల్ ఉలూంలో ఫత్వాలు జారీ చేసే బాధ్యత దారుల్ ఇఫ్తా విభాగానిది.  
ఈ మధ్య బ్యూటీపార్లర్లకు  వెళ్లే ముస్లీం మహిళల సంఖ్య పెరిగింది. దీనిపైనా దారుల్ ఉలూంకు ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించిన మత పెద్దలు... ఐబ్రోస్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించడం, ట్రిమ్మింగ్ వంటివాటిపై నిషేధం విధిస్తూ ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు జుట్టు కత్తిరించుకోవడం మత చట్టాలకు వ్యతిరేకమని దారుల్ ఉలూం పెద్దలు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com