వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

- October 20, 2017 , by Maagulf
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

మనామా: ఓ డ్రైవర్‌, ఇద్దరు పాదచారులు మూడు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మనామా, జెబ్లాత్‌ హబ్షి మరియు సనాద్‌లలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కింగ్‌ ఫైసల్‌ హైవైపే రోడ్డు ప్రమాదం జరగ్గా, ఈ ఘటనలో బహ్రెయినీ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముహర్రాక్‌ వైపు వెళుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తి సెహ్లా హైవే దాటుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. జెబ్లాత్‌ హబ్షిలో రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇస్తిక్‌లాల్‌ హైవేపై సనద్‌ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పాదచారి ఒకరు మృతి చెందారు. వేగంగా దూసుకొస్తున్న వాహనం, రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com