శ్రీనివాస్ రెడ్డి మరోసారి హీరోగా రైట్ రైట్
- October 20, 2017
గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలతో హీరోగా రెండు విజయాలు అందుకొన్నాడు స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆనందో బ్రహ్మా' సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి మరోసారి హీరో అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు. 'రైట్ రైట్' సినిమా దర్శకుడు మను
దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా పేరుతెచ్చుకొన్న సునీల్ పూర్థిస్థాయి హీరోగా మారి వరుస ప్లాపులతో హీరోగా కొనసాగలేక నానా అవస్థలు పడుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి మాత్రం కామెడీ చేస్తూనే మంచి కథ దొరికినప్పుడు మాత్రం హీరోయిజం చూపిస్తున్నాడు. ఇదేదో బాగున్నట్టుంది. సునీల్ కూడా ఈ ఫార్ములాని నమ్ముకొంటే మంచిదేమో.. !
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్‌తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









