మొబైల్ నేలకేసి కొట్టాడని ఆగ్రహించి భారతీయ వడ్రంగిని హత్య చేసిన ఓ వ్యక్తి
- October 20, 2017
దుబాయ్: ' అనవసరమైన పట్టుదలలు పంతాలు కొన్ని సందర్భాలలో ప్రాణాలు సైతం పోతాయని తెలియచెప్పే వార్త ఇది ' బతుకుతెరువు కోసం వడ్రంగి కార్మికుడిగా పనిచేసేందుకు దుబాయ్ కు వెళ్లిన ఓ భారతీయుడు విషాదకరమైన రీతిలో హత్య చేయబడ్డాడు . యూఏఈలోని దుబాయ్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాల ప్రకారం దుబాయ్ నగరంలోని దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి తన గుర్తింపుకార్డును పొగొట్టుకున్నాడు. రాత్రి సమయం కావడంతో తన సెల్‌ఫోన్ టార్చిలైట్ వేసి స్నేహితుల సహాయంతో గుర్తింపు కార్డును వెతకడం మొదలుపెట్టాడు. కార్డు కోసం వెతుకుతుండగా వారిపక్కనే 28 ఏళ్ల వయసున్న భారతీయ యువకుడు నిద్రిస్తున్నాడు. నీ మొబైల్ టార్చిలైట్ కాంతి నా కళ్లపై పడుతోందని, నిద్రచెడగొట్టొద్దని, లైట్‌ను ఆపివేయాలని కోరాడు. లైట్ ఆపివేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భారతీయ యువకుడు ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టాడు. సెల్‌ఫోన్ పగిలిపోయింది. ఈ విషయంపై ఇరువురు మధ్య తీవ్ర వివాదం జరిగింది. సెల్‌ఫోన్‌ను కొనిస్తానని హామీ ఇవ్వడంతో అందరూ అక్కడి నుంచి వెనుదిరిగారు. కొంతదూరం నడిచిన తర్వాత ఓ ఇనుప రాడ్‌ను తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి.. తన సెల్‌ఫోన్‌ను పగులగొట్టిన భారతీయ యువకుడిన విచక్షిణా రహితంగా కొట్టాడు. తల, గొంతుపై గాయాల కారణంగా తీవ్రరక్తస్రావమవ్వడంతో అక్కడిక్కడే భారతీయ యువకుడు మృతిచెందాడు. తెల్లవారుజామున సమచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమేరాలను పరిశీలించగా విషయం తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. జూన్ 27న జరిగిన ఈ ఘటనపై కోర్టు తుదితీర్పు వెల్లడించాల్సి ఉంది. నిందితుడి వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని అనుకోకుండా అలా జరిగిపోయిందని కోర్టులో నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









