అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, కుమార్తె, అల్లుడిపై నేరాభియోగం
- October 20, 2017
పదవీచ్యుతుడైన పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు అవినీతికి పాల్పడ్డారంటూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం నేరాభియోగం చేసింది. లండన్‌లోని 'అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీస్'కు సంబంధించిన అవినీతి కేసులో వీరు ముగ్గురిపైనా కేసులు నమోదైన విషయం గమనార్హం. నవాజ్ షరీఫ్‌పై 'జాతీయ జవాబుదారి బ్యూరో'(ఎన్ఏబీ) సెప్టెంబరులో మూడుకేసులు నమోదు చేసింది. కాగా, అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మర్యాం నవాజ్, అల్లుడు కెప్టెన్ (విశ్రాంత)మహమ్మద్ సఫ్దర్‌లపై సదరు కోర్టు నేరాభియోగం చేసింది. గొంతుక్యాన్సర్తో ఇప్పటిదాకా మూడు శస్త్రచికిత్సలు చేయించుకుని అనారోగ్యంతో ఉన భార్య కుల్‌సుమ్‌తో వెంట షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ కేసు నేపథ్యంలో ఆయన లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ....తనపై నేరాభియోగం మోపడాన్ని ప్రస్తావిస్తూ న్యాయాన్ని చంపేశారంటూ ఆరోపించారు. ఈ నెల 26న జరిగే తదుపరి విచారణ సమయానికి తాను తిరిగి వస్తానని కూడా నవాజ్ షరీఫ్ ప్రకటించారు. బహుశా ఆయన ఆదివారం పాక్‌కు వస్తారని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







