ఇండియాలో మొట్టమొదటి జడ్జిగా తొలి ట్రాన్స్‌జెండర్
- October 21, 2017
అబ్బాయిగా పుట్టినా అమ్మాయి లక్షణాలు వచ్చాయి. సమాజం వెక్కిరించింది. ఇంట్లో వాళ్లు చీదరించుకున్నారు. అయినా కుంగిపోలేదు. కష్టాలకు ఎదురీదింది జోయితా మొండల్. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 29 ఏళ్ల జోయితా మొండల్ తొలి ట్రాన్స్ జెండర్ జడ్జిగా నియమితురాలైంది. కోల్‌కతా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపుచ్చుకుంది. హిజ్రాల హక్కుల కోసం ఓ ఎన్జీవోను స్థాపించి ఉద్యమాలు నిర్వహించింది. ఈ సంస్థలో మూడు వేల మంది హిజ్రాలకు సభ్యత్వముంది. తనలాంటి వారికి ఎలాంటి కష్టం కలగకుండా సామాజిక సేవనే మార్గంగా ఎంచుకుంది. ఇతరుల కష్టాలను పంచుకుంది. ఇప్పుడు బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లా ఇస్లాంపూర్ లోక్ అదాలత్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తోంది.
తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా సేవలందిస్తోంది జోయితా మొండల్. జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్న జోయితా .. లోక్ అదాలత్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మిగితా వారికి ఆదర్శంగా నిలుస్తోంది. తనలా మిగతా ట్రాన్స్ జెండర్స్ కూడా రాణించి ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తోంది. 3 నెలల క్రితం సోషల్ వర్కర్ కేటగిరీ కింద జోయితా జడ్జిగా ఎంపికయ్యారు. విధి నిర్వహణలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవకాశాలు కల్పిస్తే ట్రాన్స్ జెండర్లు కూడా విభిన్న రంగాల్లో తమ ప్రతిభ చాటుకుంటారని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు







