జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో పేలిన స్మార్ట్‌ఫోన్‌..బెంబేలెత్తిన ప్రయాణికులు

- October 21, 2017 , by Maagulf
జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో పేలిన స్మార్ట్‌ఫోన్‌..బెంబేలెత్తిన ప్రయాణికులు

ఢిల్లీనుంచి బయలుదేరిన  జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో  సడెన్‌గా కలకలం రేగింది.    80 మంది  ప్రయాణికులతో ఇండోర్‌ వెళుతున్న విమానంలో ఉన్నట్టుండి దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణీకుల పై ప్రాణాలు పైనే పోయాయి.   అయితే  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది,కారణాలను కనుక్కొని ప్రయాణికులను శాంతింప చేశారు.  ఒక ప్రయాణీకురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్  పేలడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి ఇండోర్ వెడుతున్న జెట్ ఎయిర్‌ వేస్‌ విమానంలో శుక్రవారం ఈ  సంఘటన చోటు చేసుకుంది.  
 
ఢిల్లీలో ప్యాకేజింగ్   బిజినెస్‌ చేస్తున్న ,  ఢిల్లీలో మాయూర్ విహార్-ఐకి చెందిన  అతుల్  ధాల్‌ ,  భార్య అర్పితా ధాల్‌, 18 నెలల వయసున్న కుమారుడు ,  తండ్రితో కలిసి దీపావళి పండుగకు వెళుతుండగా ఈ   ప్రమాదం  సంభవించింది.   స్నాక్స్‌ ఇస్తుండగా  పొగ అలుముకోవడాన్ని విమాన సిబ్బంది గమనించారు.  వెంటనే సీటు కిందనుంచి బ్యాగును బయటకుతీసి,  ఇతర ప్రయాణీకుల సాయంతో మంటల్ని ఆర్పారు. తమ సీటు కిందనుంచి  శబ్దం రావడంతోపాటు, బాగా పొగరావడాన్ని గమనించామని అతుల్‌ ధాల్‌  తెలిపారు. బ్యాగులో ఉన్న మొత్తం మూడు సెల్‌ఫోన్‌లు ఉండగా, అందులో ఒకటి పేలిదంటూ వివరించారు.

 ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించామని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. డీజీసీఏ సూచించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామనీ, మొబైల్ పరికరాన్ని తదుపరి దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకున్నామని . మరోవైపు  పేలిన  స్మార్ట్‌ఫోన్‌ ఏ కంపెనీది తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com