టీ హబ్ ను ప్రారంభించిన కె టి ఆర్
- November 05, 2015
ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయస్థాయిలో సిద్ధం అయిన ఇంక్యుబేటర్ సెంటర్ టీ హబ్ ఘనంగా ప్రారంభమయింది. గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీ రామారావు, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేతుల మీదుగా టీ హబ్ ప్రారంభం జరిగింది. టీ హబ్ ఇండియాకు కొత్త ముఖ చిత్రమౌతుందని రతన్ టాటా కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు టీ హబ్ బాటలు వేస్తుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. స్టార్టప్‌లకు రాజధానిగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చి దిద్దుతామని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 'ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి' అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సదుపాయాలతో టీ హబ్‌కోసం కాటలిస్ట్ పేరుతో ప్రత్యేక భవనం నిర్మించారు. దేశంలోనే ప్రభుత్వం రంగంలో నిర్మితమైన ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాతో పాటు భారీ సంఖ్యలో పారిశ్రామిక ఔత్సాహికులు హాజరయ్యారు. టీ హబ్ గురించి టీ హబ్‌లో జీ+5 ఫ్లోర్లలో దాదాపు 100 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి వారి అవసరాలను బట్టి క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ కేటాయిస్తారు. కెఫ్టేరియా, ఉత్సాహపరిచే రీతిలో ఇంటిరీయర్ డిజైనింగ్, స్ఫూర్తి కలిగించేలా మహామహాహుల సూక్తులు, ఆసక్తికరమైన చిత్రాలు.. తదితర ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో ఈ భవంతిలో ఉన్నాయి. కాటలిస్ట్‌లో ఒక్కో స్టార్టప్‌కు ఏడాదిపాటు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయం తర్వాత వారి ఆలోచన సఫలం కాకపోతే నిరాశలో కూరుకుపోకుండా, ఐఎస్బీద్వారా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీరంగంలో హైదరాబాద్ పేరెన్నికగన్నది కాబట్టి ఎక్కువగా ఐటీకి చెందిన స్టార్టప్‌లే ఆసక్తి చూపిస్తున్నప్పటికీ హెల్త్‌కేర్ విభాగంలోని సంస్థలు, ఔత్సాహికులు సైతం ముందుకువస్తున్నారు. టీ హబ్‌లో ఇప్పటికే 120 స్టార్టప్‌లకు అవకాశం ఇవ్వగా.. మరో 200 కంపెనీలు అనుమతికోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం. మరోవైపు టీహబ్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రస్తుత రూ.10 కోట్ల నిధిని 100 మిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









