పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు
- October 21, 2017
రిలయన్స్ జియో రాకతో కారు చౌకగా మారిన మొబైల్ టారిఫ్‌లు మళ్లీ అదే జియో దెబ్బకు భారీగా పెరగనున్నాయి. ఈ నెల 19 నుంచి 4జీ టారిఫ్ ప్లాన్‌లను 15 నుంచి 20 శాతం మేర జియో పెంచడంతో ఇదే అదనుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లూ ఇదే బాట పట్టనున్నాయి. గత కొద్ది నెలలుగా జియో టారిఫ్‌లకు అనుగుణంగా తమ మొబైల్ చార్జీలను తగ్గించిన మొబైల్ ఆపరేటర్లు ఇప్పుడు కస్టమర్లపై పెనుభారం మోపేలా టారిఫ్‌లను సవరిస్తారని భావిస్తున్నారు. టెలికాం రంగం టారిఫ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ధరల పెంపు సానుకూల అంశమని, ప్రస్తుతం ఆపరేటర్లందరూ టారిఫ్‌ల పెంపుపై దృష్టిసారిస్తాయని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనా వేసింది.
మొబైల్ టారిఫ్‌లను తిరగరాస్తూ రిలయన్స్ జియో ఆరంభంలో కస్టమర్లకు ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయడంతో పోటీని తట్టుకునేందుకు ఇతర మొబైల్ ఆపరేటర్లూ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జియో క్రమంగా మొబైల్ టారిఫ్‌లను పెంచుతుండటంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి ఇతర ఆపరేటర్లూ తిరిగి కాల్ చార్జీలను పెంచేపనిలో పడ్డారు. ఇవి మొబైల్ కంపెనీలకు ఊరట కలిగించే పరిణామాలే అయినా సగటు కస్టమర్‌కు మాత్రం మొబైల్ టారిఫ్‌లు గుదిబండ కానున్నాయి.
మరోవైపు జియో తన రూ 149 4 జీబీ ప్యాక్‌కు అందించే డేటాను రెట్టింపు చేయడం వ్యూహాత్మక నిర్ణయమని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ పేర్కొంది. లోయర్ ఎండ్ కస్టమర్లను కాపాడుకుంటూనే హైఎండ్‌పై టారిఫ్‌ల పెంపుతో లాభాలు దండుకోవాలని జియో భావిస్తోంది. జియో మరికొన్ని ప్లాన్‌లపైనా నొప్పి తెలియకుండా కస్టమర్లకు వాతలు పెట్టింది. రూ 399 ప్లాన్‌లో వాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించింది. 84 రోజుల బెనిఫిట్స్‌ను పొందాలంటే రూ 459 ప్లాన్‌ను ఎంచుకోవాలని నూతన ప్లాన్‌ను ముందుకు తెచ్చింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









