' కంచె' చిత్రంను వీక్షించిన బాలీవుడ్ నటుడు
- November 05, 2015
వరుణ్ తేజ హీరోగా నటించిన చిత్రం ' కంచె' . ఈ చిత్రం అక్టోబర్ 22న న విజయ దశమి సందర్బంగా విడుదల అయ్యి విజయవంతం అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ ఓ సైనికుడి పాత్రలో కన్పించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చూస్తున్నారు. ఆయన ఏమన్నా ఈ చిత్రం చూసి ఆసక్తి చూపితే రైట్స్ అమ్మే అవకాసం ఉంది. క్రిష్...గతంలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన గబ్బర్ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. కంచే (ఉ /ఆ ): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! ఇక ఈ చిత్రానికి ఎన్నారైల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని జర్మనీ భాషలోకి డబ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఓ తెలుగు సినిమా ...జర్మన్ భాషలోకి డబ్బింగ్ అవటం ఇదే తొలిసారి. ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం యుఎస్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం...ఈ చిత్రాన్ని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కోటి పాతిక లక్షలు రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ $501k గ్రాస్ కలెక్షన్ వచ్చిందని తెలుస్తోంది. దాంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్ మంచి లాభం సంపాదించినట్లైంది. సినిమాకు మంచి రివ్యూలు రావటంతో యుఎస్ కలెక్షన్స్ బాగున్నాయి. ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "అబ్సొల్యూట్ తెలుగు సినిమాస్ " వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







