'సైరా... నరసింహా రెడ్డి' కి అమేజాన్ ఆఫర్.!
- October 22, 2017
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న చిత్రం 'సై రా... నరసింహా రెడ్డి'. తెలుగులో 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో వచ్చే సినిమా ఇదే కాబోతోంది. ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితంచేయకుండా హిందీ, తమిళంలో ఒకేసారి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ తారాగణంతో పాటు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు హిందీలో భారీ క్రేజ్ తెచ్చేందుకు బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్‌ను ఇందులో నటించేందుకు ఒప్పించారు.
'సై రా...' చిత్రానికి అమేజాన్ నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. 'ప్రైమ్ వీడియో' పేరుతో ఆయన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ వెబ్ సైట్ రన్ చేస్తున్న అమేజాన్ 'సై రా..' డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'సై రా...' బడ్జెట్‌లో 20 శాతం వెచ్చించి సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు అమేజాన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాత రామ్ చరణ్‌ను చిత్ర నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది.
ఈ చారిత్రక చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నారు. ఇతర కమిట్‌మెంట్స్‌తో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడమే కారణం. ఆయన స్థానంలో రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు.
'సై రా' సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తప్పుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం పుకారే అని, ఇందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది.
షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు.
డేరింగ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ పాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర తెలిపింది.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. బాహుబలి సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ ద్వారా కన్నడ మార్కెట్ వశం చేసుకోవచ్చే ఉద్దేశ్యం కనిపిస్తోంది.
క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈవిడ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ద్వారా తమిళ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించవచ్చని దర్శక నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







