వరుసగా మూడోసారి ఆసియా కప్ సొంతం చేసుకున్న భారత్
- October 22, 2017
ఆసియా కప్ హాకీ-2017 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం ఢాకా వేదికగా మలేసియాతో తలపడిన భారత్ హాకి జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయ భేరి మోగించింది. టోర్నీలో గ్రూప్ దశ నుంచి భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఫస్ట్ హాఫ్ మూడో నిమిషంలో రమణ్ దీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది.
అనంతరం 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ మరో గోల్‌ను భారత్‌కు అందించారు. మైదానంలో మెరుపులా కదులుతున్న భారత ఆటగాళ్ల నుంచి బంతిని లాక్కునేందుకు మలేసియా స్ట్రైకర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మలేసియా ఆటగాడు సహ్రిల్ సాబా 50వ నిమిషంలో ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు.
మిగిలిన సమయంలో మలేసియా ఆటగాళ్లను గోల్ చేయనివ్వకుండా భారత ప్లేయర్లు చేసిన ప్రయత్నాలు సఫలం చెందాయి. దీంతో భారత్ మూడో మారు ఆసియా విజేతగా నిలిచింది. లలిత్ ఉపాధ్యాయ్‌కు గోల్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఆకాశ్ దీప్ సింగ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







