ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న పాక్ సైన్యం
- October 22, 2017
పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదులకు సైనిక శిక్షణ ఇచ్చి కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లకు పంపుతోందని పాక్ ఆక్రమిత్ కశ్మీర్లోని ప్రముఖ సామాజిక కార్యకర్త తౌఖీర్ గిలానీ ఆదివారంసంచలన ప్రకటన చేశారు. దాదాపు 15 ఏళ్లుగా పాకిస్తాన్ తన భూభాగంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా సుమారు 500 మంది ఉగ్రవాదులకు సైనిక శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్ సైన్యం.. వారిని సురక్షిత ప్రదేశాల్లో దాచిందని ఆయన తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్లలో జీహాదీ ఉగ్రవాదులుగా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లోయలోని అమాయక గిరిజన ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించి వారికి సైనిక శిక్షణ పాకిస్తానే ఇస్తోందని ఆయన తెలిపారు. శిక్షణ పొందుతున్న యువతని కూడా అత్యంత దారుణంగా హింసిస్తారని తౌఖీర్ గిలానీ అన్నారు. ప్రధానంగా శిక్షణ పొందుతున్న కశ్మీర్ యువతను ఎవరైనా స్థానికులు పొరపాటును చూడడం జరిగితే.. వాళ్లను కల్చి చంపాలనే కఠిన ఆదేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. నీలం లోయని ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్తాన్ మార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







