అమెరికాలో ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటన
- October 24, 2017
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఒహియో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జాన్ క్యారీతో ఆయన భేటీ అయ్యారు. ఒహియో రాష్ట్రంలో ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అలాగే గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తుది ఎంవోయూను సిద్ధం చేశారు. అనంతరం ఎంవోయూలపై ఇరువురు మంత్రులు సంతకాలు చేశారు. దీనివల్ల ఒహియో వర్సిటీల్లో చదివిన ప్రతి విద్యార్థికి రూ.10లక్షల వరకు లబ్ది చేకూరనుంది. అమెరికన్ అకడమిక్ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ ఎంవోయూ అమల్లోకి వస్తుంది. కాగా... ప్రతి ఏడు ఒహియోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3-4వేల మంది విద్యార్థుల వలస వెళుతున్నారు. బ్యాచులర్, ఎంఎస్ నుంచి మెడికల్, ఇంజినీరింగ్ అన్నికోర్సులకు ఫీజు రాయితీ వర్తిస్తుందని మంత్రి గంటా తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







