బ్లూవేల్ కంటే ప్రమాదకరమైన కొత్త చిత్రం 'కీ'
- October 25, 2017
'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జీవా కథానాయకుడిగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతోన్న సైకలాజికల్ థ్రిల్లర్ 'కీ'. నిక్కి గల్రాని, అనైన సోఠీ హీరోయిన్స్‌గా నటించారు. రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కలీస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బేనర్స్ నిర్మాణంలో సినిమా తెలుగులో విడుదలవుతుంది.
రెండు వైపుల పదునైన కత్తిలా ఉన్న టెక్నాలజీని కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉపయోగం ఎంత ఉంటుందో, నష్టం కూడా అంతే ఉంటుంది. కంప్యూటర్ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ నష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంతగా. అలాగే రీసెంట్ టైమ్స్‌లో బ్లూవేల్ గేమ్ వార్తను మనం తరుచూ చదువుతూనే ఉన్నాం. ఈ బ్లూవేల్ గేమ్ ఆడి ఎంతో మంది యువత బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన బ్లూవేల్ గేమ్ కూడా ఈ సాంకేతికతలో భాగంగానే ఉంది. కానీ ఇటువంటి బ్లూవేల్ కంటే ప్రమాదకరమైన ఆటను మనం అందరం ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే `కీ` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు 'కీ' సినిమా దర్శక నిర్మాతలు.
ఈ సినిమా టీజర్‌ను రీసెంట్గా అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. తెలుగు టీజర్ ఇప్పటికే 1.5 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకోవడం విశేషం. దర్శకుడు కలీస్ సినిమాను సాంకేతికతలోని మరో కోణాన్ని టచ్ చేస్తూ కీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









