ముంబైలో భారీ అగ్నిప్రమాదం
- October 26, 2017
ముంబైలో బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ దగ్గర్లో ఉన్న గరీబ్‌నగర్‌లో చెలరేగిన మంటలు కాసేపటికే చుట్టుపక్కలకు విస్తరించాయి. స్టేషన్‌లోని పాదచారుల వంతెనకు కూడా మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం 16 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు.
గరీబ్‌నగర్‌లో కొంతకాలంగా పేదలు అనుమతి లేకుండా నివసిస్తున్నారు. దీంతో కాలనీని ఖాళీ చేయాలంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు బుధవారం నోటీసులిచ్చారు. అయితే గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా కాలనీకి చేరుకున్న సిబ్బంది.. జేసీబీలతో ఇళ్లను కూల్చడం మొదలు పెట్టారు. ఇంతలో ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి క్రమంగా కాలనీ అంతటా వ్యాపించి... స్టేషన్‌ను చుట్టుముట్టాయి.
ప్రమాదం జరిగిన అరగంటకు కానీ ఫైరింజన్లు రాలేదని.. అందువల్లే మంటల తీవ్రత పెరిగిపోయిందని.. స్థానికులు చెబుతున్నారు. కాలనీ ఖాళీ చేసేందుకు 48 గంటల గడువు ఇచ్చిన అధికారులు.. 24 గంటలు గడవక ముందే వచ్చి దౌర్జన్యం చేశారని... ఆ హడావుడిలోనే అగ్నిప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







