బాణసంచా కర్మాగారంలో పేలుడు, 47 మంది మృతి
- October 26, 2017
ఇండోనేషియలోని జకార్తాలో పెను విషాదం చోటుచేసుకుంది. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో ఈ ఉదయం ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. పేలుడు దాటికి మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో తప్పించుకునే మార్గం లేక చాలామంది వాటికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 47 మంది మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మరో 43 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతంగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పక్కనే ఉన్న భవనం కూడా సగం వరకు కూలిపోయింది. మంటల దాటికి కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఉదయం పది గంటల సమయంలో ఓ పేలుడు సంభవించిందని, మూడు గంటల తర్వాత మరో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఆరు వారాల నుంచి మాత్రమే నడుస్తున్నట్టు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుళ్లకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







