ట్రాఫిక్ జరీమానాలపై 55 శాతం డిస్కౌంట్ .!
- October 26, 2017
రస్ అల్ ఖైమా: నవంబర్ 1 నుంచి 15 వరకు రస్ అల్ ఖైమా పోలీసులు ట్రాఫిక్ జరీమానాలపై 55 శాతం డిస్కౌంట్ని అందుబాటులోకి తెస్తున్నారు. కేవలం రెండు వారాలు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో జరీమానాలు చెల్లించాల్సినవారు వీలైనంత త్వరగా చెల్లించాలని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అది అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి చెప్పారు. రస్ అల్ ఖైమా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఏడవ యాక్సెసన్ యానివర్సరీ సందర్భంగా ఈ ఆఫర్‌ని ప్రకటించినట్లు మేజర్ జనరల్ అది అబ్దుల్లా చెప్పారు. ఎమిరేట్‌లో ఈ తరహా డిస్కౌంట్ ఇదే తొలిసారి. వాహనదారులు తమ వాహనాల్ని నిబంధనలకు అనుగుణంగా నడపాలనీ, జరీమానాలు విధించడం ద్వారా వాహనదారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం రస్ అల్ ఖైమా పోలీసులకు లేదనీ, వాటి ఉద్దేశ్యం వాహనదారుల్లో చైతన్యం పెంచడమేనని వివరించారు అది అబ్దుల్లా.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







