బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ప్రారంభం.!
- October 26, 2017
మనామా: బహ్రెయిన్ ప్రీమియర్ రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ - బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమవుతోంది. మనామాలో మూడు రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. అక్టోబర్ 28 ఆఖరి రోజు. స్థానిక అంతర్జాతీయ ఎగ్జిబిటర్స్ ఈ ఈవెంట్లో తమ తమ ప్రాజెక్టుల వివరాల్ని అందుబాటులో ఉంచుతారు. అలాగే అత్యద్భుతమైన ఆఫర్లు వినియోగదారుల కోసం ఎదురుచూస్తున్నాయి. 10వ ఎగ్జిబిషన్లో 60కి పైగా ఎగ్జిబిటర్స్, 100కి పైగా ప్రాజెక్టులు రీజియన్ నుంచి ఇక్కడ కొలువు దీరుతున్నాయి. లక్కీ విజిటర్స్‌కి గ్రాండ్ ప్రైజ్‌లు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. బహ్రెయిన్ ఇంటర్నేషననల్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ బిపెక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ మొహమ్మద్ ఖలిల్ అల్సాయెద్ మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడంతోపాటు, బహ్రెయిన్‌లో రియల్ ఎస్టేట్ గొప్పతనాన్ని చాటిచెప్పడమే ఈ ఈవెంట్ ఉద్దేశ్యమని అన్నారు. 2016లో నిర్వహించిన ఎగ్జిబిషన్లో 8 వేలకు పైగా యూనిక్ విజిటర్స్ హాజరు కాగా, అందులో 24 శాతం మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







