సైకిల్ దొంగతనంను అడ్డుకొన్న భారతీయ సెక్యూరిటీ గార్డుపై సుత్తితో యువకుల దాడి
- October 26, 2017
దుబాయ్: నిలిపి ఉంచిన ఓ సైకిల్ దొంగిలించాలని ఆ ఇద్దరు 18 ఏళ్ళ యువకులు భావించారు. కాపలా ఉంటున్న భారతీయ సెక్యూరిటీ గార్డ్ వీరి చేష్టలను గమనించి వారిని పట్టుకొబోయాడు దాంతో వారు వెంట తెచ్చుకొన్న సుత్తితో ఆ గార్డుపై బలంగా మోదారు. వైద్య నివేదిక ప్రకారం ఆ దాడిలో బాధితునికి ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఆగస్ట్ 9 వ తేదీన18 ఏళ్ల వయస్సు ఉన్న కుర్రోళ్ళు ఇద్దరు దుబాయ్ లోని ఓకే మెట్రో స్టేషన్ లో పార్కింగ్ నుండి ఒక సైకిల్ దొంగిలించడానికి ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు ఎమిరాటి కాక మరొకరు కొమొరోస్ దీవులకు చెందిన పాస్పోర్ట్ దారుడు. సెక్యూరిటీ గార్డుపై బౌతికంగా దాడిచేయడాన్ని కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఆరోపణలు చేయబడ్డాయి.ఈ కేసుని చిన్నపిల్లల జువెనల్స్ కోర్టుకు తరలించారు. ఈ సంఘటన ఆగస్ట్ 9 వ తేదీన అల్ కతర్ మెట్రో స్టేషన్లో జరిగింది. ఈ కేసుని అల్ ఖుస్సైస్ పోలీసు స్టేషన్ కు నివేదించబడింది. మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసిన సైకిళ్లను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు గమనించి నిందితుడిని నిలువరించే యత్నం చేసెనని భారతీయ సెక్యూరిటీ గార్డు వెల్లడించారు. "నేను రాత్రి సుమారు 9 గంటల సమయంలో నా డ్యూటీ పూర్తి చేశాను. ఆ యువకులలో ఒకరు పార్కింగ్ చేసి ఉన్న సైకిళ్లలో ఒక సైకిల్ తాళం తీస్తున్నప్పుడు..నేను గట్టిగా ఏమి చేస్తున్నరక్కడ అని వారిని ప్రశ్నించినప్పుడు వారిలో ఒకరు నాపై సుత్తితో దాడి చేశాడు.. వీరికి మద్దతుగా మరో ముగ్గురు స్నేహితులు సైకిళ్లలో అక్కడకు వచ్చారు, నేను వారిని గమనించి పిర్యాదు చేయడానికి స్టేషన్ కు వేగంగా నడుస్తుంటే వారు నన్ను వెంబడించి నా వెనుక భాగానికి తగిలేవిధంగా సుత్తిని విసిరేశారు. ఇంకొక అనుమానితుడు నా మీదకు తన బూటుని విసిరేసారు. నేను అర్ధరాత్రి 1.15 గంటలకు (ఆగస్టు 10 వ తేదీ తెల్లవారుజామున) జరిగిన సంఘటనపై యధాతధంగా పోలీసులకు పిర్యాదు చేసినట్లు బాధిత గార్డు తెలిపారు. ఆగస్టు 14 వ తేదీన స్టేషన్ వద్ద పోలీసులు నిందితులను చూపించగా సెక్యూరిటీ గార్డు వారిని గుర్తించాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







