గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి
- November 06, 2015
గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగశాఖాధికారులను కోరినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ నేడు కలిశారు. ఈ భేటీలో ఎంపీ వినోద్, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్‌లు పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కష్టాలను కేంద్ర విదేశాంగశాఖ దృష్టికి తీసుకువెళ్లాం. గల్ఫ్‌లో తెలంగాణవాసులు ఇబ్బంది పడుతున్నరు. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాం. గల్ఫ్‌లో కరీంనగర్ జిల్లావాసులు వేల సంఖ్యలో కార్మికులుగా పని చేస్తున్నరు. పనుల నిమిత్తం వెళ్లిన మహిళలకు ఎదురైన ఇబ్బందులను మంత్రిత్వశాఖ అధికారులకు వివరించినం. గల్ఫ్‌లాంటి ప్రాంతాల్లో మహిళలను ఇళ్ల పనుల్లోకి తీసుకురాకుండా కేంద్ర నిషేధ చట్టాన్ని తీసుకురావాలని కోరాం. గల్ఫ్‌తో పాటు విదేశాల్లో పని చేస్తున్న భారతీయులందరి వివరాలను ఒకే డేటాగా రూపొందించాలని కోరాం. రాష్ర్టాలతో విదేశీ మంత్రిత్వశాఖ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సూచించినం. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పెద్దూరుకు చెందిన ఐదురుగు కార్మికులు ఎదుర్కొంటున్న శిక్షపై చొరవ చూపాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి రెఫరెండంను అధికారులకు అందజేసినం. అవసరమైతే బాధిత కుటుంబాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







