చైనా అధ్యక్షుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌కు ఇన్వెస్టర్లు ఝల�

- October 27, 2017 , by Maagulf
చైనా అధ్యక్షుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌కు ఇన్వెస్టర్లు ఝల

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌కు (ఓబీఓఆర్‌) ఇన్వెస్టర్లు ఝలక్‌ ఇచ్చారు. ప్రధానంగా ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశాల్లో నిర్మిస్తుండడంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ.. ఎకనమిక్‌ కారిడార్‌ నిర్మించాలని చైనా ప్రతిపాదించింది.

చైనా ప్రతిపాదిత 68 దేశాల్లో 27 దేశాలకు బిలో ఇన్వెస్టిమెంట్‌ గ్రేడ్‌ (సాధారణ పెట్టుబడి)ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఇచ్చాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, సిరియా, ఇరాక్‌ వంటి 14  దేశాలకు సున్నా రేటింగ్‌ను ఇచ్చాయి. మరికొన్ని దేశాలు అత్యంత అవినీతికరమైనవిగా రేటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ కింద రహదారులు, రైల్వేలు, పోర్టులు, పవర్‌ గ్రిడ్‌లు, నిర్మించాలని.. ఇందుకు 1.2 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు అవసరమవుతాయని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది.

ఇదిలా ఉండగా.. 2050 నాటికి భూమి సరిహద్దుల వరకూ ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ద్వారా విస్తరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. ఒబీఓఆర్‌ను తమ దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రేటింగ్‌ సంస్థలు పేర్కొన్న ఫైనాన్షియల్‌ రిస్క్‌ గురించి చైనాలోని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫార్మ్‌ కమిషన్‌, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com