చట్టవిరుద్ధంగా 114 మంది ఒమన్ జలాల్లోనికి ప్రవేశం : 48 మంది అరెస్టు

- October 28, 2017 , by Maagulf
చట్టవిరుద్ధంగా 114 మంది ఒమన్ జలాల్లోనికి ప్రవేశం : 48 మంది అరెస్టు

గత వారం చట్టవిరుద్ధంగా మస్కట్ లోకి ప్రవేశించిన114 మందిని దేశం నుండి బహిష్కరించినట్లు   రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అదేవిధంగా వివిధ దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన 46 మందిని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేసింది. ఢోఫర్ నుంచి 21 మంది, 14 మంది బురైమి , ఉత్తర బాటినాలో ఆరుగురు , మస్కాట్ లో ఐదుగురితో కలిపి అరబ్, ఆసియన్, ఆఫ్రికన్ జాతీయులకు సంబంధించిన దౌత్యవేత్తలతో సమన్వయం చేసి114 మంది వ్యక్తులను దేశం నుండి బహిష్కరించడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన 339 మందిలో 32 మంది మహిళలతో సహా వారి దేశాలకు వారిని అప్పచెప్పేందుకు   చట్టపరమైన చర్య తీసుకునే ముందు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com