యూఏఈ ఎయిర్‌పోర్టుల్లో పొగమంచు
- October 27, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా నెలకొంటోందని పేర్కొంది. దుబాయ్, షార్జా, అబుదాబీ ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కన్పిస్తోంది. ఖలీఫా కాలేజ్, దుబాయ్‌లోని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారు ఝాము నుంచీ పొగమంచు విపరీతంగా నమోదైంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువగా నమోదు కానుంది. పగటి పూట వాతావరణం బాగానే ఉంటుందనీ, ఒక్కోసారి పాక్షికంగా మేఘావృతం అవడం జరుగుతుంటుందని ఎన్‌సిఎంఎస్ పేర్కొంది. మేఘాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అది కూడా సాయంత్రం వేళ మేఘాలు దర్శనమిస్తాయి. సాధారణం నుంచి ఓ మోస్తరు గాలులు వీయనున్నాయి. రాత్రి వేళలో హ్యుమిడిటీ శాతం పెరగనుంది. ఉష్ణోగ్రతలు 36 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. హ్యుమిడిటీ లెవల్స్ అత్యధికంగా 95 శాతం వరకు ఉంటాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







