మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో 'డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా' అవార్డు

- October 28, 2017 , by Maagulf
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో 'డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా' అవార్డు

మాజీ మంత్రి, టీపీీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య  అమెరికాలో డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా అవార్డును అందుకున్నారు. గ్లోబల్ అఫీసియల్ ఆఫ్ డిగ్నిటీ జీవోడి సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును సంస్థ నిర్వాహకులు ఆయనకు బహూకరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాలతోపాటు  లాటిన్ అమెరికా,ఆఫ్రికా, కరేబియన్,లెబనాన్ దేశాలకు చెందిన ఐదుగురికి అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లరతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com