ఉత్తరకొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.!
- October 28, 2017
జగడాల మారి ఉత్తరకొరియాకు అమెరికా రక్షణశాఖ మంత్రి జిమ్ మాటిస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరకొరియా అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. తాము భారీ సైనిక బలగంతో బదులివ్వాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా చర్యలపై ఘాటుగా స్పందించారు.
'అమెరికా, మా మిత్ర దేశాలపైన దాడులు చేస్తే.. వాటిని మేము దీటుగా తిప్పికొడతాం. మీరు అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. మేము సమర్థమంతమైన భారీ సైనిక బలగంతో స్పందిస్తాం' అని మాట్టిస్ హెచ్చరించారు. ఇటీవల ఉత్తరకొరియా ఆరో అణుపరీక్ష చేయడాన్ని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అప్పటి నుంచి ట్రంప్, కిమ్‌జోంగ్ ఉన్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాధినేతలు ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు.
తరచూ అణుపరీక్షలు చేస్తున్న ఉ.కొరియాను అదుపు చేసేందుకు అమెరికా పలు దేశాలను ఏకం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ దేశానికి అడ్డుకట్ట వేసేందుకే ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉ.కొరియాపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







