ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం
- October 29, 2017
దిల్లీ: దిల్లీలో ఇటీవల ప్రియా మెహ్రా అనే వివాహితపై కాల్పులు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో నిందితుడైన ప్రియ భర్త పంకజ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేవలం దర్యాప్తు చేసి జైల్లో పెట్టడం కాకుండా పంకజ్‌ను ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియ, పంకజ్ ప్రేమించి వివాహం చేసుకున్నారని, ఇప్పుడు ఇలా హత్య చేసి చంపుతాడని అసలు వూహించలేదని పంకజ్ తండ్రి తెలిపారు. అప్పు ఎగ్గొట్టడానికి పంకజ్ ఈ మర్డర్ ప్లాన్ వేసినట్లు విచారణలో తెలిపాడు. అదీకాకుండా అతనికి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఓ గాయనితోవివాహేతర సంబంధం ఉందని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఆమెతోకలిసి ఉండేందుకే భార్యను వదిలించుకోవాలనుకున్నాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పంకజ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!