బ్రిటన్‌ యువరాజు కు పొంచి ఉన్న ముప్పు

- October 29, 2017 , by Maagulf
బ్రిటన్‌ యువరాజు కు పొంచి ఉన్న ముప్పు

లండన్‌: బ్రిటన్‌ యువరాజు విలియమ్‌, కేట్‌ మిడిల్టన్‌ దంపతుల ముద్దుల కుమారుడు ప్రిన్స్‌ జార్జ్‌ పేరు ఐసిస్‌ ఉగ్రవాదుల హిట్‌ లిస్ట్‌ జాబితాలో ఉంది. నాలుగేళ్ల జార్జ్‌ను హత్య చేసేందుకు ఐసిస్‌ ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటన్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఐసిస్‌ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో జార్జ్‌ ఫొటోను పోస్టు చేసి అతడిని చంపేస్తామంటూ బెదిరింపు సందేశాలు పెట్టారు. ఆ సందేశం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు.
జార్జ్‌ హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందనే విషయాన్ని బ్రిటీష్‌ నిఘా అధికారులు గుర్తించారు. దీంతో జార్జ్‌ చదువుకుంటున్న పాఠశాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల జార్జ్‌ పాఠశాల ఆవరణలో తిరుగుతున్న సమయంలో ఓ మహిళ ఫొటోలు తీయడంతో అక్కడి భద్రత ఆందోళనకరంగా మారింది. కొద్దిరోజులకు ఫొటోలు తీసిన మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పాఠశాలల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com