ఒక్కరోజు పైలట్ గా విమానం నడిపే అవకాశం దక్కించుకున్న అబుదాబీ బాలుడు
- October 29, 2017
అబుదాబీ : కలలు కనండి ..వాటిని సాకారం చేసుకోండని దివంగత మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమూల్యమైన మాట ఆ బాలుడు బహుశా విన్నాడేమో ? ఏక్ దిన్ కా సుల్తాన్ కావాలని ఆ బాలుడు కోరుకోలేదు..తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చమని ఆ బుడతడు ఏకంగా విమానయాన అధికారులనే అభ్యర్ధించాడు. ఏదో పెద్దవాళ్ళ ముందు మార్కులు కొట్టేయాలని ఈ బుడ్డోడు బురిడీ కొట్టిస్తున్నాడని భావించి అసలు విమానాలకు సంబంధించి కాక్ పీట్ కు సంబంధించి సాంకేతిక వివరాలు ఆ విమాన అధికారులు అడిగేరు..అబుదాబీ కి చెందిన ఆడమ్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానం..కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతికత వివరాలతో సహా గడ గడ చెప్పాడు. విమానాలకు సంబంధించిన పరిజ్ఞాన్నాన్ని గమనించి ఎతిహాద్ ఎయిర్వేస్ సిబ్బంది నోరు వెళ్ళబెట్టారు. తమ విమానయాన సంస్థలో ఆడమ్‌కు ఒక్కరోజు పైలట్‌గా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఆడమ్‌ను ఎతిహాద్ ఎయిర్వేస్ శిక్షణా కేంద్రానికి పిలిచి.. పైలట్ యూనిఫాం ధరింపచేసి ఎయిర్‌బస్ ఏ380కు ఒక్కరోజు సహాయ పైలట్‌గా అవకాశం ఇచ్చారు. ఇక... ఆడమ్‌కు విమానం నడిపించడంలో పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్ సమెరె యాక్లెఫ్ ఆడమ్ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్వేస్ అధికారుల అనుమతితో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతే కాదు.. ఆ చిన్నారి కచ్చితంగా భవిష్యత్తులో మంచి పైలట్ అవుతాడని నెటిజన్లు ఆ బాలుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. . ఏ380 ఎయిర్‌బస్‌కు కెప్టెన్ అవ్వడమే ఆడమ్ జీవిత ఆశయమట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







