జనవరి 25న రావాల్సిన రోబో 2 సినిమాని సమ్మర్ కి వాయిదా
- October 29, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా శంకర్ తెరకెక్కిస్తున్న రోబో 2.o పోస్ట్ పోన్ అవుతోంది. అవుననే సమాధానమే వస్తోంది కోలీవుడ్ నుంచి. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమా లేట్ అవుతోందట. జనవరి 25న రావాల్సిన సినిమాని సమ్మర్ కి వాయిదా వేశారట.
రోబో టు పాయింట్ ఓ....నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉన్న సినిమా ఇది. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రోబోకి సీక్వెల్ ఇది. అయితే డైరెక్టర్ శంకర్ మాత్రం...రోబోకి ఇది కొనసాగింపు కాదు..పూర్తిగా మరొక స్టోరీతో తెరకెక్కించాం అంటున్నాడు. లైకా సంస్థ దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
రజనీకాంత్ హీరోగా చేస్తుంటే...బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా సౌత్ లోనే కాక, బాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకు రిలీజైన రజనీ, అక్షయ్ ల ఫస్ట్ లుక్ కి, మేకింగ్ వీడియోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమీజాక్సన్ హీరోయిన్ గా చేస్తోంది.
రోబో టు పాయింట్ ఓ మూవీ ఆడియోని రెండు రోజుల క్రితం దుబాయ్ లో రిలీజ్ చేశారు. సినిమాని వచ్చే జనవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా మరింత లేట్ అవుతుందట. అందుకే సినిమాని సమ్మర్ లో ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలనుకుంటున్నాట్లు వార్తలు వస్తున్నాయి. అదీ కాక జనవరిలో అక్షయ్ నటించిన కొత్త సినిమా విడుదలవుతోంది. అందుకే పోస్ట్ పోన్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







