స్కూల్లో అగ్ని ప్రమాదం: 14 మందికి గాయాలు
- October 29, 2017
మస్కట్: దఖ్లియాలోని నిజ్వాలోగల బిర్కత్ అల్ మౌజ్ ప్రాంంలో ఓ స్కూలు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఉమ్ అల్ ఫాదిల్ ప్రైమరీ స్కూల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. ఉదయం 6.57 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సెస్ అధికార ప్రతినిథి చెప్పారు. సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సివిల్ డిఫెన్స్ టీమ్ మెంబర్స్. ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో 14 మందికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం, చిన్న చిన్న గాయాలు మాత్రమే కావడంతో ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష