ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే!
- October 30, 2017
న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజల భద్రత విషయంలో అసలు రాజీపడటంలేదు. కార్లలో భద్రతా ప్రమాణాలను పెంచే ప్రతిపాదనలకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి..
2019 జులై తర్వాత తయారు చేసే కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి కానున్నాయి. దీంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్, 80 కిలోమీటర్ల వేగాన్ని మించితే అప్రమత్తం చేసే వ్యవస్థ, సీట్‌బెల్ట్ రిమైండర్, సెంట్రల్ లాకింగ్‌ను మానవ ప్రమేయంతో తీయగలిగే వ్యవస్థలు తప్పని సరిగా ఉండాల్సి ఉంటుంది.
రివర్స్ పార్కిగ్ సెన్సర్‌ను కంపెనీలు ఇప్పటికే చాలా కార్లలో అమరుస్తున్నాయి. కానీ దీనిని ఆప్షనల్‌గా మాత్రమే సమకూరుస్తున్నాయి. టాప్ ఎండ్ మోడల్స్‌లో మాత్రమే ఇవి ఉంటున్నాయి. సాధారణంగా విలాసవంతమైన కార్లలో ప్రారంభ మోడల్ నుంచే ఈ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
స్పీడ్ అలర్ట్ వ్యవస్థ ఇలా..
ఇప్పటికే చాలా కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులోకి వచ్చాయి. సీట్ బెల్ట్ అలర్ట్ కూడా ఉంది. కానీ కొత్తగా స్పీడ్ అలర్ట్ వ్యవస్థ రానుంది. కారు వేగం 80 కిలోమీటర్లు దాటితే తొలి హెచ్చరిక వస్తుంది. 100 కిలోమీటర్ల వేగం దాటితో హెచ్చరికలు జోరందుకుంటాయి. 120 కిలోమీటర్ల వేగం దాటితే నాన్‌స్టాప్‌గా హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. 2016లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1.51లక్షల మంది మృతి చెందారు. వీరిలో 74,000 మంది వేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష