ఫిబ్రవరి 9న వస్తానంటోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
- October 30, 2017
ప్రముఖ నిర్మాణ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా .. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ "వరుణ్ తేజ్ హీరోగా మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఇటీవల సినిమా షెడ్యూల్ లండన్‌లో జరిగింది. నలభై రోజుల పాటు ఏకధాటిగా జరిగిన ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణలో 70 శాతం టాకీ పూర్తయ్యింది. డిసెంబర్ నెలనాటికి షూటింగ్‌ను పూర్తి చేస్తాం. థమన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, జార్జ్ సి.విలియమర్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష