కలరా తో పోరాటానికి బహ్రైన్ సర్వ సన్నద్ధం
- November 07, 2015
ఇరాక్ లో ఇటీవల ప్రబలుతున్న అంటువ్యాధి కలరా, మరియు దానిగురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) వారి సిఫారసులను గురించి ప్రభుత్వం చాల జాగ్రత్తగా గమనిస్తున్నట్టు, అటువంటి కేసులను మొదట్లోనే కనిపెట్టడానికి, నిఒవరన చర్యలు తీసుకోవడానికి ఒక సమగ్రమైన ప్రణాళికతో సర్వ సన్నద్ధంగా ఉన్నామని, ప్రజారోగ్య శాఖ డైరక్టర్ - డా. మరియమ్ అల్ హాజిరి హామీ ఇచ్చారు. ఇరాక్ కు వెళ్ళే వారిని బాటిల్ నీటిని వాడాలని; పళ్ళు, కూరగాయలను కడగడానికి ఆహారాన్ని వండడానికి కూడా బాటిల్ నీటిని వాడాలని; భోజనానికి ముందు తరువాత, బాత్ రూం కు వెళ్లి న తరువాత, డయేరియా తో బాధపడుతున్న వారికి అవసరమైన సపర్యలు చేసిన అనంతరం కుడా చేతులను పరిశుభ్రంగా కడగాలని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు సూచించారు. ఇరాక్ నుండి తిరిగి వచ్చినపుడు ఏ విధమైన తినుబండారాలను గాని, ద్రవ పదార్ధాలను గాని తీసుకు రావద్దని, తద్వారా దేశంలోకలరా వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడాలని ఆరోగ్య శాఖ వారు పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







