హైదరాబాద్‌లో షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు ఘనస్వాగతం
- October 31, 2017
వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీకాంత్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కిదాంబి మాట్లాడుతూ.. వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. నా విజయాల వెనుక కోచ్ పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉంది.ః అని తెలిపారు. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ఒకే ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో కిదాంబి శ్రీకాంత్ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







